బజ్..మహేష్, త్రివిక్రమ్ సినిమాకు కూడా అతనే.?

Published on Apr 24, 2021 1:30 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం తర్వాత మహేష్ చెయ్యబోయే సినిమా కూడా ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. తన క్రేజీ కాంబో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఈ సినిమా ఉండనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఇప్పుడు మన తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను ఈ చిత్రానికి కూడా లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. “అరవింద సమేత” నుంచి సరికొత్త థమన్ ను ప్రెజెంట్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు మూడో సినిమాకు కూడా ఓకే చేసినట్టు అని చెప్పాలి. అలాగే మహేష్ తో కూడా థమన్ కు సూపర్ ఆల్బమ్స్ ఉన్నాయి. సో దీనిపై కూడా మంచి అంచనాలు సెట్టవ్వడం కన్ఫర్మ్ అని చెప్పాలి. మరి దీనిపై ఆధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :