రాజ్ తరుణ్ కి ‘ఇద్దరి లోకం..’ ఎంతో కీలకం !

Published on Dec 9, 2019 9:02 pm IST

జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం హిట్ కోసం ఫైట్ చేస్తున్న రాజ్ తరుణ్ కి ఈ ‘ఇద్దరి లోకం’ విజయం తీసుకువస్తోందా ? ఈ సినిమా హిట్ అవ్వడం అనేది రాజ్ తరుణ్ కెరీర్ కి ఎంతో కీలకం కానుంది. ఎందుకంటే గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయినట్లు హీరోయిన్ పరిస్థితి అలాగే ఉంది. ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More