మొట్ట మొదటిసారిగా మహేష్ షూట్ అక్కడ.?

Published on Jul 7, 2021 7:04 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ “సర్కారు వారి పాట” పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఈ సినిమాలో ఉండే ప్రతి అంశంపై కూడా వినిపిస్తున్న బజ్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ నిమిత్తం మళ్ళీ పలు లొకేషన్స్ లో మేకర్స్ షూటింగ్ కోసం డేట్స్ లాక్ చేశారు. మరి వచ్చే 12 నుంచి మహేష్ షూట్ ను షురూ చేస్తుండగా ఈ షూట్ లొకేషన్స్ లో మహేష్ మొట్ట మొదటి సారిగా వైజాగ్ లో షూట్ కి పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

తాను చేసిన ఇన్నేళ్ల సినిమాలో ఆక్చువల్ వైజాగ్ లొకేషన్స్ లో షూటింగ్ జరగలేదు కానీ ఇప్పుడు మొదటిసారి సర్కారు వారి పాట కి జరగనుందట. ఇప్పటికే దర్శకుడు పరశురామ్ వైజాగ్ షెడ్యూల్ నిమిత్తం అన్ని పనులు కూడా రెడీ చేసేసారట. అక్కడ కొన్ని కీలక ప్రాంతాల్లో ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రాకరించనున్నారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :