ప్రముఖ నటుడు కుటుంబంలో నలుగురికి కరోనా

ప్రముఖ నటుడు కుటుంబంలో నలుగురికి కరోనా

Published on Jul 12, 2020 7:59 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుప ఖేర్ కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో సందేశం ఇవ్వడం జరిగింది. కొద్దిరోజులుగా ఆకలి, నిద్ర లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్ లో చేర్చి బ్లడ్ టెస్ట్ చేయగా, ఎటువంటి సమస్య లేదని తేలిందట. దీనితో డాక్టర్స్ సలహా మేరకు సిటీ స్కాన్ చేయించగా ఆమెకు కోవిడ్ నిర్ధారణ అయినట్లు ఆయన చెప్పారట. దీనితో కుటుంబ సభ్యులు మొత్తానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా…అనుపమ్ ఖేర్ అన్నా వదిలతో పాటు వాళ్ళ అమ్మాయికికరోనా సోకినట్లు తేలింది అన్నారు.

ఇక వీరిని కోకిలా బెన్ హాస్పిటల్ లో చేర్చినట్లు ఆయన చెప్పారు. మీ ప్రేమా, ఆశీస్సులతో తన కుటుంబం క్షేమంగా తిరిగి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక అమితాబ్ కుటుంబంలో ఆయనతో పాటు అభిషేక్, ఐశ్వర్య రాయ్ మరియు ఆరాధ్య కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు