ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ హవా

Published on Jul 18, 2019 3:00 am IST

రామ్ నటించిన కొత్త చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ రేపు విడుదలకానుంది. చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న కీలకమైన నాలుగు థియేటర్లు సంధ్య 35 ఎంఎం, సంధ్య 70 ఎంఎం, సుదర్శన్ 35 ఎంఎం, తారకరామ థియేటర్లన్నీ ఈ చిత్రానికే కేటాయించారు.

ఇలా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఎక్కువ థియేటర్లను ఒకే సినిమాకి కేటాయించడం స్టార్ హీరోల విషయంలో మాత్రమే జరుగుతుంటుంది. అలాంటిది రామ్ సినిమాకు కేటాయించారంటే సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయి క్రేజ్ నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా సోలో రిలీజ్ కూడా బాగా కలిసొచ్చింది. దీని మూలంగా సినిమా మొదటిరోజు ఓపెనింగ్స్ భారీ స్థాయిలోనే ఉండనున్నాయి. చిత్రం కూడా బాగుంటే లాంగ్ రన్ వసూళ్లు రామ్ కెరీర్లోనే ఉత్తమమైనవిగా నిలుస్తాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగార్వల్, నాభ నటేష్ కథానాయికలుగా నటించారు.

సంబంధిత సమాచారం :