‘విజయ్‌ సేతుపతి’ బెగ్గర్ లో క్యామియో రోల్ ?

‘విజయ్‌ సేతుపతి’ బెగ్గర్ లో క్యామియో రోల్ ?

Published on May 26, 2025 1:02 PM IST

vijay puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత తన కొత్త సినిమా బెగ్గర్ ని విజయ్‌ సేతుపతి హీరోగా పూరి ప్రకటించాడు. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ క్యామియో కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఆ క్యామియో రోల్ లో నాగార్జున కనిపించబోతున్నట్లు తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో నాగార్జున – పూరి కలయికలో “సూపర్”, “శివమణి” లాంటి హిట్ సినిమాలు వచ్చాయి.

కాబట్టి, విజయ్ సేతుపతి బెగ్గర్ లో నాగ్ గెస్ట్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఐతే, ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తానికి పూరి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు