షురూ అయ్యిన షారుఖ్ భారీ చిత్రం..ఫ్రెష్ అప్డేట్స్ ఇవే!

Published on Sep 4, 2021 9:00 am IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరియు కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ దర్శకుడు అట్లీ ల కాంబోలో ఎప్పుడు నుంచో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం పై గత కొన్ని రోజులు నుంచి పలు ఊహాగానాలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై ఫ్రెష్ అప్డేట్స్ బయటకి వచ్చాయి. మరి వీటి ప్రకారం అట్లీ ఈ చిత్రాన్ని నిన్ననే పూణే లో స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ చిత్రం ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా ఉంటుందని టాక్. వీటితో పాటుగా ఈ సినిమాకి ఆల్రెడీ అదిరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిపోయినట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ నయనతార తో పాటుగా సన్యా మల్హోత్రా కూడా ఫిక్స్ అయ్యిందట. మొత్తానికి మాత్రం వీరి కాంబో నుంచి చాలా ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఇది వస్తుంది. దీనితో మళ్ళీ షారుఖ్ బాక్సాఫీస్ కం బ్యాక్ గట్టిగా ఉండాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :