టాక్.. పవన్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ అప్పటినుంచే మొదలు!?

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి తో మంచి కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత పవన్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సాలిడ్ ప్రాజెక్ట్ తెరకెక్కనుండగా ఇటీవల ఈ సినిమా కూడా అనౌన్స్ అయ్యి ఫ్యాన్స్ లో జోష్ నింపింది. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది.

మేకర్స్ ఈ మార్చ్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేయనున్నట్టుగా ఇప్పుడు టాక్. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ అప్పటికి బయటకొస్తాయని తెలుస్తుంది. ఆల్రెడీ పవన్ ఈ సినిమా కోసం కొత్త లుక్ లోకి మారిన సంగతి తెలిసిందే. దీనితో సురేందర్ రెడ్డి ఏం కుక్ చేస్తున్నారు అని ఫ్యాన్స్ లో కూడా ఉత్సుకత నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version