భర్తను బ్యాటుతో బాదేస్తున్న దీపికా పదుకొనె

Published on Jun 12, 2019 12:05 pm IST

దీపికా పదుకొనె తన భర్త అయిన రణ్వీర్ సింగ్ ని బ్యాటుతో బాదుతుంటే, ఫన్నీ రియాక్షన్ ఇచ్చిన వీడియో ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.”స్టోరీ అఫ్ మై లైఫ్, రియల్ అండ్ రీల్ ” అనే ట్యాగ్ కూడా పోస్ట్ చేశారు. ఐతే ఇది నిజంగా భర్తపై కోపంతో భార్య బాదడం లాంటిది కాదులెండి. రణ్వీర్ ప్రస్తుతం ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ బయో పిక్ ’83’ లో నటిస్తున్నారు.క్రీడా ప్రధానంగా దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె చేస్తున్నారు. కాబట్టి ఈ రియల్ భార్యా భర్తలు రీల్ భార్యా భర్తలుగా కనిపించనున్నారన్నమాట.

ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రస్తుతం విరివిగా పాల్గొంటున్నారు ఈ సెలెబ్రిటీ కపుల్. దానిలో భాగంగానే ఈ లాంటి ఫన్నీ వీడియోస్ తో మూవీకి హైప్ తెచ్చే పనిలోపడ్డారు. తమిళ్ హీరో జీవా ఓ కీలకపాత్రలో చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 2020 వేసవి లో మూవీని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More