విక్రమ్, శంకర్ కలయికలో తెరకెక్కుతున్న ‘ఐ’ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తంతు చూస్తుంటే ‘ఐ’ విడుదలకు మరింత జాప్యం కలిగే అవకాశం వుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జోరుగా జరుపుకుంటుంది.
తమిళ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తిగా పుర్తవ్వడానికి ఇంకా 6 నుండి 7 వారాలు పడుతుందట.ఈ విషయాలపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గ్రాఫిక్స్ విభాగం మాత్రం శంకర్ అంచనాలను అందుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుందట. విక్రమ్ సరసన ఈ చిత్రంలో అమీ జాక్సన్ నటిస్తుంది. రెహమాన్ సంగీతదర్శకుడు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత


