డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “గామి”

డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “గామి”

Published on Apr 3, 2024 1:55 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ డిఫెరెంట్ స్క్రిప్ట్ లతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల గామి (Gaami) చిత్రం తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు విశ్వక్. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మౌత్ టాక్ కూడా బాగానే వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

జీ 5 లో ఏప్రిల్ 12, 2024 నుండి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. థియేటర్ల లో సినిమా చూడటం మిస్ అయిన వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. విద్యాదర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో చాందిని చౌదరి, అభినయ లు కీలక పాత్రల్లో నటించారు. విశ్వక్ సేన్ తదుపరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు