‘గానా ఆఫ్ రిపబ్లిక్’ వచ్చేసిందోచ్..!

Published on Jul 10, 2021 11:50 pm IST

మెగా హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు దేవ కట్టా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ “రిపబ్లిక్”. జీ స్టూడియోస్‌ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ ఓ ఐఏఎస్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా సినిమాలోని ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అయితే మెలోడీ బ్రహ్మ మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగానే ఈ పాటను విడుదల చేసినట్టు అర్ధమవుతుంది. “నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం.. నా మౌనం పాడే గానం.. నా ప్రశ్న సమాధానం అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. రహమాన్‌ రాసిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, ధనుంజయ్‌, హైమత్‌ మహమ్మద్‌, ఆదిత్య అయ్యంగర్‌, పృధ్వీ చంద్ర ఆలపించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :