గద్దలకొండ గణేష్ నైజాం ఓపెనింగ్ కలెక్షన్స్ , వరుణ్ కెరీర్ బెస్ట్.

గద్దలకొండ గణేష్ నైజాం ఓపెనింగ్ కలెక్షన్స్ , వరుణ్ కెరీర్ బెస్ట్.

Published on Sep 21, 2019 11:02 AM IST

Gaddalakonda Ganesh

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ల మాస్ ఎంటర్టైనర్ గద్దలకొండ గణేష్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా దుమ్మురేపుతుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రం మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. నైజాంలో గద్దలకొండ గణేష్ మొదటిరోజు 1.7కోట్ల షేర్ సాధించి అబ్బురపరిచింది. ఈ మొత్తం వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ కావడం విశేషము.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ చిత్రం దాదాపు 5 కోట్ల షేర్ వరకు సాధించినట్లు తెలుస్తుంది. పాజిటివ్ వర్డ్ అఫ్ మౌత్ సొంతం చేసుకున్న ఈ చిత్రం మిగిలిన రెండు వారాంతపు దినాలలో మొదటిరోజుకు మించిన వసూళ్లు సాధించే అవకాశం కలదని తెలుస్తుంది. వరుణ్ మాస్ గ్యాంగ్ స్టర్ లుక్ మరియు ఆయన తెలంగాణా యాస డైలాగ్స్ మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పటికే గద్దలకొండ గణేష్ మూవీ 28% జరిపినట్లు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు