‘గద్దలకొండ గణేష్’ నైజాం కలెక్షన్స్ !

Published on Sep 22, 2019 12:34 pm IST

వరుణ్‌ తేజ్‌ – హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ముఖ్యంగా నైజాంలో ‘గద్దలకొండ గణేష్’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు. ఎక్కువుగా బి,సి సెంటర్స్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శనివారం నాడు, నైజాంలో ‘గద్దలకొండ గణేష్’ 1.42 కోట్ల రూపాయల థియేటర్ షేర్ ను రాబట్టింది. మొత్తం ఈ చిత్రం రెండు రోజులకు గానూ నైజాంలో రూ .3.66 కోట్ల షేర్ ను సాధించింది. ఇక ఎలాగూ ఆదివారం మంచి అడ్వాన్స్ బుకింగ్స్ తో మంచి కలెక్షన్స్ వస్తాయి. మొత్తం 3 రోజులకు గానూ నైజాంలో ఈ సినిమా రూ .4.50 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం ఉంది.

కాగా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా మరో కొత్త క్యారెక్టర్‌ లో కనిపించాడు. అలాగే హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ కూడా సినిమాలో హైలెట్ అయ్యాయి. ఇక ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించగా.. పూజా హెగ్డే, మృణాలిని రవి కీలక పాత్రల్లో నటించారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More