గ్యాంగ్ లీడర్ వచ్చేస్తున్నాడు

Published on Aug 9, 2019 12:28 pm IST

నిరీక్షణకు తెరదించుతూ హీరో నాని తన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్ విడుదల తేదీని ప్రకటించేశాడు. ముందుగా ఊహించన విధంగానే సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్నీ ట్విట్టర్ వేదికగా నాని అభిమానులతో పంచుకున్నాడు.

తన కెరీర్ ప్రారంభమైన చిత్రం అష్టా చెమ్మా, కెరీర్ ని గాడిలో పెట్టిన భలే భలే మగాడివోయ్ చిత్రాలు రెండూ సెప్టెంబర్ లో విడుదల కాగా మళ్ళీ ఆ రెండు చిత్రాల తరువాత గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ లో వస్తుంది అని అర్థం వచ్చేలా నాని ట్వీట్ చేయడం జరిగింది. నిజానికి గ్యాంగ్ లీడర్ ఆగస్టు 30న విడుదల కావాల్సివుండగా సాహో కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే. కానీ అలాంటి నెగెటివ్ పాయింట్ కి కూడా పాజిటివిటీ జోడించి నాని చేసిన ట్వీట్ ఆయన పాజిటివ్ నేచర్ ని తెలియజేస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, హీరో కార్తికేయ మొదటిసారి నెగెటివ్ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :