చెప్పినట్లే ‘గ్యాంగ్ లీడర్’ పై మరో అప్డేట్ ఇచ్చిన నాని

Published on Jul 18, 2019 11:40 am IST

ఐదుగురు ఆడవాళ్ళూ అందులో ఒకరు 70ఏళ్ల వృద్ధురాలైతే,10 ఏళ్ల పాప ఒకరు,ఒక గృహిణి, ఇద్దరు యంగ్ లేడీస్ ఇది నాని గ్యాంగ్. ఈ గ్యాంగ్ కి లీడర్ అయిన నాని వీరి సహాయంతో ఎవరిపై ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు అనేది ఆసక్తికరం. విలక్షణ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గ్యాంగ్ లీడర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులలో అమితాసక్తిని రేకెత్తించింది.సాధారణంగా హీరో గ్యాంగ్ అంటే కండలు తిరిగి, ఉత్సాహం కలిగిన యువకులు ఉంటారు, కానీ నాని గ్యాంగ్ లో అందరూ ఆడవాళ్లే.

అంతే కాకుండా ఇది ప్రతీకార గ్యాంగ్ అంటున్నారు. ఐదుగురు ఆడవాళ్లు కలిగిన నాని గ్యాంగ్ ఎవరిపై ప్రతీకారం తీర్చుకోనున్నారు అనేది తెలియాల్సివుంది. కాగా నేడు సాయంత్రం 7గంటలకు ‘రా… రా…’అనే సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా నాని పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. కలకత్తా కాళీ మాతను పోలిన ఆ పోస్టర్ ని చూస్తుంటే ఈ సాంగ్ చాలా సీరియస్ నోట్ లో నడిచేలా అనిపిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 30న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :