గ్యాంగ్ లీడర్ సందడి లేదేంటి …?

Published on Aug 24, 2019 8:48 am IST

హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. వచ్చే నెల 13న విడుదల కానుంది. ఈనెల 30న విడుదల కావల్సివున్న గ్యాంగ్ లీడర్ అనూహ్యంగా వాయిదాపడింది. విలక్షణ దర్శకుడిగా పేరున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని గతంలో ఎప్పుడూ చేయని రివేంజ్ రైటర్ రోల్ చేస్తున్నారు. గ్యాంగ్ లీడర్ విడుదలకు ఇంకా 20 రోజుల వ్యవధి కూడా లేదు. ఐనా చిత్ర బృందం ప్రచారం పై ద్రుష్టి సారించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటివరకు గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ మాత్రమే విడుదల అయ్యాయి.

మరో వైపు గ్యాంగ్ లీడర్ మరో మారు వాయిదాపడిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రచారం పై చిత్ర యూనిట్ ద్రుష్టి పెట్టకపోవడం ఆ వాదనలకు బలం చేకూర్చుతుంది . కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న గ్యాంగ్ లీడర్ మూవీలో హీరోయిన్ పేరు కూడా అంతగా ప్రేక్షకుల దృష్టికి రాకపోవడం గమనార్హం. మరి ఎప్పటికైనా నాని మేల్కొని గ్యాంగ్ లీడర్ ప్రచార జోరు పెంచుతారేమో చూడాలి మరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :