తూర్పుగోదావరి జిల్లలో దుమ్మురేపిన గంగ కలెక్షన్స్

తూర్పుగోదావరి జిల్లలో దుమ్మురేపిన గంగ కలెక్షన్స్

Published on May 14, 2015 10:59 PM IST

ganga
లారెన్స్ తెరకెక్కించి నటించిన ‘గంగ’ సినిమా విడుదలైన అన్ని చోట్లా అద్భుతమైన కలెక్షన్ లను సొంతం చేసుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు కోటి డబ్బై లక్షలను సంపాదించిపెట్టింది. మునుపటి సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద మొత్తమనే చెప్పాలి.

విశేషమేమిటంటే ప్రేక్షకుల కోరిక మేరకు అదనపు స్క్రీన్ లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారట. తాప్సీ, నిత్యామీనన్ హీరోయిన్స్. తమన్ సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు