“గ్యాంగ్‌స్టర్ గంగరాజు” ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్..!

Published on Jun 11, 2022 1:00 am IST

విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ లాంటి మరో వైవిధ్య భరితమైన సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. మంచి అభిరుచి గల దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పటికే షూటింగ్‌ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్‌ని జూన్ 12వ తేది సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాకి సాయి కార్తీక్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

సంబంధిత సమాచారం :