మరో డేంజరస్ లుక్‌లో గరుడ రామ్..!

Published on Jul 8, 2021 1:32 am IST

కేజీఎఫ్ సినిమాలో ‘గరుడ’ రోల్ పోషించిన రామ్ కు ఆ పాత్ర విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో ఆయనకి వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ‘మహాసముద్రం’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోశిస్తున్న ఆయనకు, చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ‘భళా తందనాన’ సినిమాలో కూడా విలన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. నేడు గరుడ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న ‘ఆనంద్ బలి’ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పొడవాటి జుట్టు మరియు గుబురైన‌ గడ్డంతో కనిపిస్తున్న గరుడ రామ్ మరోసారి ప‌ర్‌ఫెక్ట్ విల‌న్‌గా కనిపిస్తున్నాడు.

ఇదేకాకుండా సాయి శివన్.జే దర్శకత్వంలో వస్తున్న ‘వైరం’ సినిమాలో కూడా గరుడ రామ్ మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఈ రోజు గరుడ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి కూడా ఆయన చేస్తున్న పాత్ర డేవిడ్ లుక్‌కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో గరుడ రామ్ గుబురు జుట్టు, గడ్డంతో కనిపిస్తూ కుర్చీలో కూర్చుని, మొండెం నుంచి వేరు చేసిన ఓ వ్యక్తి తలను చేతిలో పట్టుకుని డేంజరస్‌గా కనిపిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :