కొత్త షెడ్యూల్ ప్రారంభంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’

29th, August 2016 - 12:57:09 PM

Gautamiputra-Satakarni
దర్శకుడు క్రిష్ వివాహం సందర్బంగా కాస్త విరామం తీసుకున్న నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ తిరిగి ఈరోజు మొదలుకానుంది. ఇటీవలే జార్జియా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ముఖ్యమైన యుద్ధ సన్నివేశాల్ని దాదాపు పూర్తి చేసుకుంది. ఈరోజు జరగబోయే షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఇప్పటీకే మధ్యప్రదేశ్ చేరుకుంది. ఈ షెడ్యూల్లో ఇంకొన్ని ముఖ్యమైన సన్నివేశాల ఘాటింగ్ జరగనుంది.

ఈ సినిమా ఒకప్పుడు భారతదేశాన్ని పాలించిన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతాన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈరోజుటితో బాలకృష్ణ పరిశ్రమలోకి అడుగుపెట్టి 42 ఏళ్ళు పూర్తయింది. 14 ఏళ్ల వయసులో 1974 లో ఇదేరోజున స్వయంగా తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కల’ చిత్రంలో బాలకృష్ణ వెండితెరపై కనిపించారు.