మరో స్టార్ డైరెక్టర్ చేతుల్లోకి అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ ?

Published on Feb 9, 2019 6:36 pm IST

చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్న ‘వర్మ’ చిత్రాన్ని మళ్ళీ రీ షూట్ చేస్తున్నారు. ఇంతకుముందు వెటరన్ డైరెక్టర్ బాలా ఈచిత్రాన్ని డైరెక్ట్ చేయగా ప్రొడ్యూసర్స్ కు అవుట్ ఫుట్ నచ్చక పోవడంతో ధృవ్ తప్ప మిగితా అందరిని మార్చి మళ్ళీ రీషూట్ చేస్తామని ఇటీవల వారు ప్రకటించారు.

ఇక ఈచిత్రాన్ని లవ్ స్టోరీ లను తెరకెక్కించడంలో దిట్టయినా గౌతమ్ మీనన్ కు అప్పజెప్పనున్నారని సమాచారం. అయితే ఇటీవల గౌతమ్ మీనన్ కూడా సరైన హిట్లు లేవు. మరి ఈ చిత్రానికి సరైన అవుట్ ఫుట్ ఇస్తాడో లేదో చూడాలి. బ్లాక్ బ్లాస్టర్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ4 ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :