ఆసిస్టెంట్ కోసం నటుడిగా మారిన స్టార్ డైరెక్టర్

ఆసిస్టెంట్ కోసం నటుడిగా మారిన స్టార్ డైరెక్టర్

Published on Dec 27, 2019 9:27 PM IST

దర్శకులు కొంతమంది అప్పుడప్పుడు నటులుగా మారి స్క్రీన్ మీద కాసేపు మెరవడం మనం చూశాం. ఇప్పుడు వారి బాటలోనే స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటుడిగా మారారు. అది కూడా కాసేపు కాదు సినిమా మొత్తం. వివరాల్లోకి వెళితే గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన అసిస్టెంట్ మను ఆనంద్ విష్ణు విశాల్ హీరోగా ‘ఎఫ్ఐఆర్’ అనే సినిమాను తెరకెక్కిస్తునారు.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆనంద్ గౌతమ్ మీనన్ వద్దకు వెళ్ళగానే అయన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సినిమా ఆరంభం నుండి చివరి వరకు గౌతమ్ మీనన్ సినిమాలో కనిపిస్తారట. ఈరోజే అయన షూటింగ్లో జాయిన్ అయ్యారని, వారంపాటు షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రం 2020 వేసవికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు