స్టార్ హీరోకి విలన్‌గా మారిన గౌతమ్ మీనన్

Published on Jan 28, 2021 1:30 am IST

దర్శకుడు గౌతమ్ మీనన్ ఈమధ్య కొత్త టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. దర్శకత్వంతో పాటు నటుడిగాను రాణిస్తున్నారు. వెబ్ సిరీస్, సినిమాల్లో పాత్రలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులకు నచ్చాయి. నటుడిగా ఆయన్ను అంగీకరించారు ప్రేక్షకులు. దీంతో పూర్తిస్థాయిలో పెద్ద పాత్ర చేయడానికి రెడీ అయ్యారు ఆయన. అది కూడ విలన్ రోల్ కావడం విశేషం. అందునా ఒక స్టార్ హీరో సినిమాలో కావడం గమనిందగిన విషయం.

స్టార్ హీరో శింబు త్వరలో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇందులోనే గౌతమ్ మీనన్ విలన్ రోల్ చేస్తారు. ‘పతు తల’ అనేది ఈ సినిమా టైటిల్. ఇందులో శింబు గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఎన్.కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఈయన గతంలో గౌతమ్ మీనన్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే తన సినిమాలో ప్రతినాయకుడిని చేసుకున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఇకపోతే శింబు గతంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘విన్నైతాండి వరువాయ’ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన సంగతి విథితమే.

సంబంధిత సమాచారం :