‘గోవిందుడు అందరివాడేలే’ నైజాం రికార్డ్ కలెక్షన్స్ రిపోర్ట్.!

‘గోవిందుడు అందరివాడేలే’ నైజాం రికార్డ్ కలెక్షన్స్ రిపోర్ట్.!

Published on Oct 7, 2014 11:27 AM IST

GAV
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన అచ్చ తెలుగు కుటుంబ కథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా దసరా కానుకగా విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్ చేత సూపర్బ్ అనిపించుకుంటోంది. దసరా కానుకగా వీకెండ్ కి రెండు రోజుల ముందే రిలీజ్ అయిన ఈ సినిమాకి లాంగ్ ఫస్ట్ వీక్ రావడంతో అన్ని చోట్లా కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ముఖ్యంగా నైజాంలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదయ్యాయి.

మాకు అందిన కలెక్షన్స్ రిపోర్ట్ ప్రకారం సోమవారం(నిన్నటి) వరకూ గోవిందుడు అందరివాడేలే ఒక్క నైజాంలోనే 9 కోట్ల 60 లక్షల షేర్ సాధించింది. అలాగే మొదటి వారం పూర్తయ్యే టైంకి 10 కోట్ల మార్క్ ని ఈజీ గా క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. కమర్షియల్ మూవీ స్థాయిలో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కలెక్షన్స్ సాదిస్తుండడంతో బండ్ల గణేష్ చాల ఆహాప్పిగా ఉన్నారు. ఒక్క నైజాంలోనే కాకుండా అన్ని చోట్లా సక్సెఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా మొదటి వారం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వ్వసూలు చేస్తుందని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు