సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్

Published on Jun 30, 2014 3:30 pm IST

Govindudu-Andarivadele
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ఓ స్పెషల్ సెట్లో ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు.

‘ఈ రోజు సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. చాలా క్రేజీగా ఉంది. కృష్ణ వంశీ గారు నాకొక ఫన్నీ గెటప్ ఇచ్చారు. ఆ గెటప్ కి సంబందించిన ఫోటో త్వరలో పోస్ట్ చేస్తానని’ రామ్ చరణ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

రామ్ చరణ్ తో పాటు ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ – ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమలినీ ముఖర్జీ శ్రీ కాంత్ కి జోడీగా కనిపించనుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :