25 సంవత్సరాల తర్వాత తమిళ్ కి వెళ్ళిన గీత ఆర్ట్స్

geetha-arts
టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్స్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి.. గీత ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ నిర్మాతగా 2015లో ఫుల్ బిజీ కానున్నాడని ఇదివరకే తెలియజేశాం. అందులో భాగంగా తన బ్యానర్ లో మొదటగా ‘డార్లింగ్’ అనే తమిళ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ప్రేమకథా చిత్రమ్’కి రీమేక్. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే గీత ఆర్ట్స్ బ్యానర్ వారు సుమారు 25 సంవత్సరాల తర్వాత తమిళంలో ఓ సినిమా చేసారు.

గీత ఆర్ట్స్ లో 1989లో రజినీకాంత్ హీరోగా ‘మాప్పిళ్లై’ సినిమా చేసారు. ఆ సినిమా అక్కడ పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమా చిరంజీవి నటించిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమాకి రీమేక్. ఆ తర్వాత గీత ఆర్ట్స్ లో వస్తున్న తమిళ సినిమా ఇదే. స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి – గీత ఆర్ట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version