విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈచిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈచిత్రంలో విజయ్ దేవరకొండ , రష్మిక ల కెమిస్ట్రీ హైలైట్ గా నిలవనుంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకులముందుకు రానున్న ఈచిత్రం ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి.


