తమిళనాడులో గీత గోవిందం కొత్త రికార్డు !
Published on Sep 5, 2018 4:38 pm IST


విజయ్ దేవరకొండ,రష్మిక జంటగా పరుశరాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల ఫై చిలుకు గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈచిత్రం విడుదలై 20రోజులు అవుతున్న ఇప్పటికి కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి.

ఇక ఈ చిత్రం తమిళనాడులో దుమ్ము రేపుతుంది. 20రోజులకుగాను ఈచిత్రం అక్కడ రూ.6కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి నాన్ బాహుబలి రికార్డు ను క్రియేట్ చేసింది. బాహుబలి చిత్రం తరువాత అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గీత గోవిందం కావడం విశేషం. ఈచిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ విడుదల చేసింది.

  • 6
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook