గీత గోవిందం డైరెక్టర్ మహేష్ ను ఇంప్రెస్ చేసాడు !

Published on May 8, 2019 8:29 am IST

గీత గోవిందం బ్లాక్ బాస్టర్ హిట్ తరువాత డైరెక్టర్ పరుశురామ్ స్టార్ హీరోలతోనే సినిమా తీస్తానని పట్టుపట్టి కూర్చున్నాడు. దానికి తగ్గట్లు గానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కు ప్లాన్ చేశాడు కానీ ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా కు ప్రయత్నాలు మొదలుపెట్టాడు పరుశురామ్.

ఇటీవల ఈ డైరెక్టర్ ,మహేష్ బాబు ను కలిసి స్టోరీ లైన్ ను వినిపించాడట. లైన్ నచ్చి మహేష్ ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడట. ప్రస్తుతం పరశురామ్ స్క్రిప్ట్ పూర్తీ చేసే పనిలో వున్నాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నాడు. ఈచిత్రం తరువాత పరశురామ్ -మహేష్ కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.

సంబంధిత సమాచారం :

More