‘గీతగోవిందం’లోని రెండో సాంగ్ విడుదల పై దర్శక నిర్మాతల స్పందనలు !

‘గీతగోవిందం’లోని రెండో సాంగ్ విడుదల పై దర్శక నిర్మాతల స్పందనలు !

Published on Jul 10, 2018 6:00 PM IST

Geetha Govindam
విజ‌య్‌ దేవ‌ర‌కొండ ఒక్క అర్జున్ రెడ్డి చిత్రంతోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. కాగా విజ‌య్‌ దేవ‌ర‌కొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘గీతగోవిందం’. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ అద్భుతంగా సంగీతం సమకూర్చారట. తాజాగా ఈ చిత్రంలోని “ఇంకేం ఇంకేం కావాలి” అనే మెలోడిని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాటను అనంత శ్రీరామ్ తన సహజ శైలిలో అందమైన పదాలతో రచించారు. ఈ చిత్రంలో విజ‌య్‌ దేవ‌ర‌కొండ సరసన ఛలో ఫేమ్ ర‌ష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ ఫై నిర్మాత బ‌న్నివాసు నిర్మాణంలో.. శ్రీ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో ఈ ‘గీత గోవిందం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

ఐతే ఈ సాంగ్ విడుదల సందర్భంగా దర్శక నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ మాట్లాడుతూ.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందుతున్న ‘గీతగోవిందం’ సినిమా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అల్లు అరవింద్ గారి ఆశీస్సులు బ‌న్ని వాసు స‌పోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది. గోపి సుందర్ మంచి ఆల్బమ్ ఇచ్చారని అన్నారు.

ఇక చిత్ర స‌మ‌ర్ప‌కులు ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ గారు మాట్లాడుతూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీత‌గోవిందంలో ఇప్పటికే మెద‌టి పాటన రిలీజ్ చెయ్యడం జరిగింది. మంచి మెలోడిగా ఆ పాట ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. ప‌రుశురాం మంచి టేస్ట్ వున్న డైరెక్టర్. హీరోయిన్ ర‌ష్మికను ఈ సినిమా త‌రువాత గీత అని పిలుస్తారు అంత‌ బాగా న‌టించింది. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నామని చెప్పారు.

ఈ చిత్ర నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. నేను నిర్మాతగా అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌కులుగా నిర్మిస్తున్న చిత్రం గీత‌గోవిందం. ఈ చిత్రంతో విజ‌య్ దేవ‌రకొండ మ‌రోసారి యావత్ ప్రేక్ష‌కులను త‌న‌వైపుకు తిప్పుకుంటాడని నమ్ముతున్నాను. దర్శకుడు ప‌రుశురామ్ కి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ని హ్యాండల్ చెయ్యడం పెన్నుతో పెట్టిన విధ్య. ఇప్పుడు విడుదల చేసిన ఇంకేం ఇంకేం కావాలే అనే పాట వింటే చాలు.. ఈ చిత్రంలో పాటలకు ఎంత ప్రాధాన్యం వుందో తెలుస్తోంది అని తెలిపారు.

తాజా వార్తలు