భారీ ధరకు “శ్యామ్ సింగరాయ్” శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జెమినీ టీవీ..!

Published on Dec 11, 2021 1:12 am IST


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదల కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను భారీగా చేస్తునట్టు తెలుస్తుంది. ఇప్పటికే హిందీ డబ్బింగ్ హక్కులను 10 కోట్ల రూపాయలకు భ్4ఊ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను 10 కోట్లకు జెమినీ టీవీ దక్కించుకుంది. నాని కెరీర్‌లో శాటిలైట్ రైట్స్ విషయంలో ఇదే బిగ్గెస్ట్ డీల్.

సంబంధిత సమాచారం :