వివాదాల్లోకెక్కిన జార్జి రెడ్డి !

వివాదాల్లోకెక్కిన జార్జి రెడ్డి !

Published on Nov 18, 2019 4:00 PM IST

George Reddy1

ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు జార్జి రెడ్డి. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు జార్జిరెడ్డి. అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పై విడదలకు ముందే వివాదం పాలయింది. ఏబీవీపీ(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) నేతలు ఈ సినిమా పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఏక పక్షంగా ఏబీవీపీ విద్యార్థులనే టార్గెట్ చేసి లేనివి ఉన్నట్లు చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా జార్జిరెడ్డి హత్య కేసులో ఏబీవీపీ విద్యార్థుల హస్తం లేదని కోర్టు గతంలోనే తీర్పునిచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానుంది ఈ సినిమా.

కాగా 1960, 70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కల్లకు కట్టబోతున్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి ఇతర నటీనటులు. ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటిస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు