గెట్ రెడీ..మెగాస్టార్ “భోళా శంకర్” నుంచి రేపు మాస్ ట్రీట్.!

Published on Dec 31, 2021 2:00 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సాలిడ్ మాస్ ప్రాజెక్ట్స్ లలో దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తున్న భారీ సినిమా “భోళా శంకర్” కూడా ఒకటి. తమిళ సూపర్ హిట్ సినిమా ‘వేదాళం’ కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

మరి ఇప్పుడు ఈ భారీ సినిమా నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ని ఇప్పుడు రివీల్ చేశారు. ఈ కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1 ఉదయం 9 గంటల మెగాస్టార్ మాస్ ట్రీట్ ని విట్నెస్ చెయ్యడానికి రెడీగా ఉండమని అలెర్ట్ చేస్తున్నారు. మరి ఇది ఫస్ట్ లుక్ పోస్టరా లేక గ్లింప్స్ వీడియోనా ఏ అప్డేట్ అనేది మరింత ఆసక్తిగా మారింది.

మరి ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తీ సురేష్ చిరుకి సోదరి పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ సినిమాకి మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :