
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన ఫ్యాన్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా తక్కువ షూటింగే జరుపుకున్నా సినిమా ఇచ్చిన ట్రీట్ మాత్రం గట్టిగా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రం షూటింగ్ పవన్ ఇతర పనులు మూలాన కాస్త ఆలస్యం అవ్వగా.
ఇప్పుడు అయితే మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందిస్తున్నట్టుగా స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ నే లేటెస్ట్ ట్వీట్ చేసారు. తమ ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్ నుంచి ఒక సంథింగ్ స్పెషల్ అప్డేట్ రాబోతుంది అని ఫ్యాన్స్ ని అయితే అలర్ట్ చేస్తున్నారు. అలాగే హరీష్ అయితే ఈ అప్డేట్ పట్ల చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెప్తున్నాడు. మరి ఆ అప్డేట్ ఏంటి అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
Something interesting is coming up with our PR team and @MythriOfficial hats off to your observation guys…. Am excited!!!
Keep it up ????????????????????#UstaadBhagathSigh— Harish Shankar .S (@harish2you) July 2, 2023