హీట్ పెంచుతున్న ‘సర్కారు వారి ఫస్ట్ నోటిస్’.!

Published on Jul 31, 2021 1:08 pm IST

మన స్టార్ హీరోల సినిమాల నుంచి పలు ఎగ్జైటింగ్ అప్డేట్స్ వస్తున్నాయి అంటే చాలు సోషల్ మీడియా అంతా వారి కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. మరి అలా గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియా అంతా సూపర్ స్టార్ మహేష్ బాబు కంట్రోల్ లో ఉంది. తన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” నుంచి ఎప్పుడైతే అధికారిక ప్రకటనలు రావడం మొదలయ్యాయో అక్కడ నుంచి ఈ చిత్రం పేరు రీసౌండ్ అవుతుంది.

అయితే ఈరోజు ఈ చిత్రం నుంచి ఫస్ట్ నోటిస్.. అదే ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుండడంతో మరింత హీట్ మొదలయ్యింది. ఇప్పటికే మేకర్స్ మహేష్ ని నెవర్ బిఫోర్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చేసారు. దీనితో ఇపుడు సమయం గడుస్తున్నా కొద్దీ ఈ ఫస్ట్ లుక్ పై మరింత హైప్ పెరుగుతుంది. మరి ఈ మాస్ పోస్టర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈరోజు 4 గంటల 5 నిమిషాల వరకు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం :