ఘని డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఆహా!

Published on Jul 5, 2021 10:03 pm IST

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఘని. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్రం డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ను ఆహా వీడియో 24 కోట్ల రూపాయల కి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయిన 45 రోజుల తర్వాత ఆహా లో స్ట్రీమ్ కానుంది.

అయితే కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సిద్దు ముద్ద,అల్లు బాబీ నిర్మాతలు గా వ్యవహిస్తున్నారు. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :