మరో టెక్నికల్ మూవీ కోసం ‘ఘాజీ’ డైరెక్టర్ !

Published on Feb 25, 2019 11:55 am IST

‘ఘాజీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు తెలుగు పరిశ్రమను కూడా ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. కాగా ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని హీరో పెట్టి సంకల్ప్ దర్శకత్వం వహించిన ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయినప్పటికీ మొట్టమొదటి తెలుగు స్పేస్ థ్రిల్లర్ మూవీ అని మంచి పేరు వచ్చింది.

కాగా తాజాగా సంకల్ప్ రెడ్డి మరో టెక్నికల్ మూవీ కోసం స్క్రిప్ట్ రాస్తున్నారు. అంటార్కిటికాలో జరిగే పరిశోధనల నేపథ్యంలో సినిమా తీయాలని సంకల్ప్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చిందాకా ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :