టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “ఘోస్ట్”

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “ఘోస్ట్”

Published on Feb 4, 2024 10:14 PM IST

కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఎం. జి. శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ హీస్ట్ థ్రిల్లర్ ఘోస్ట్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. తెలుగు లో కూడా రిలీజైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ మంగళవారం సాయంత్రం 6:00 గంటలకు ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ సినిమాలు లో ప్రసారం కానుంది. జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు. ఈ చిత్రం టీవీ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు