మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ బి.జి.ఎమ్ తో “సాహో” అనిపించారుగా

Published on Jun 14, 2019 11:27 am IST

మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ‘సాహో’ టీజర్ విడుదల తర్వాత మళ్లీ మరొకమారు వార్తలలో నిలిచాడు. ‘సాహో’ టీజర్ నిన్న విడుదలై విశేష స్పందన అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుంది. ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆసాంతం ఎంటర్టైనింగ్ గా ఉండే విధంగా దర్శకుడు సుజీత్ టీజర్ ని కట్ చేశారు.

ఐతే ఈ టీజర్ లో మరో ఆకర్షణ ఏమిటంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో ఓ సన్నివేశం పండాలంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత అవసరమో తెలిసిందే. సాహో టీజర్ కి ‘బి జి ఎం’ మరో ఎస్సెట్ గా చెప్పుకోవచ్చు. టీజర్ లో మనం ఎంజాయ్ చేస్తున్న ‘బి జి ఎమ్’ ని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ సమకూర్చారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కి జిబ్రాన్ అందించిన హాలీవుడ్ రేంజ్ మ్యూజిక్ టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘సాహో’ టీజర్ ‘బి జి ఎమ్’ కి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఈ టాలెంట్ మ్యూజిక్ డైరెక్టర్, సుజీత్ మొదటి మూవీ “రన్ రాజా రన్” కి సంగీతం అందించారు. అలాగే కమల్ హాసన్ ఉత్తమ విలన్,విశ్వరూపం 2 అలాగే తెలుగులో అనేక సినిమాలకి మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :

More