‘ఉత్తమ విలన్‌’తో గిబ్రాన్‌కు మరింత క్రేజ్..!

‘ఉత్తమ విలన్‌’తో గిబ్రాన్‌కు మరింత క్రేజ్..!

Published on May 5, 2015 8:45 PM IST

Uttamavillain
‘యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. ఎప్పట్నుంచో వివాదాలను ఎదుర్కొంటూ వస్తోన్న ఈ సినిమా చివరకు అన్ని అడ్డంకులను దాటుకొని శనివారం సాయంత్రానికి విడుదలైంది. నిజానికి ఈ సినిమా శుక్రవారమే (మే 1న) విడుదల కావాల్సింది. చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా ఆరోజు విడుదలకు నోచుకోలేదు. ఇక విడుదల ఇప్పుడంటూ, అప్పుడంటూ చెలరేగిన గందరగోళం మధ్యే ఈ సినిమా శనివారం సాయంత్రం విడుదలైంది.

‘ఉత్తమ విలన్’ సినిమాకు విడుదల అయిన అన్ని చోట్లనుంచీ మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. సినీ విశ్లేషకుల నుంచి మాత్రం ఈ సినిమా విషయంలో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కమల్ హాసన్ అందించిన కథకు, ఆయన అనితర సాధ్యమైన నటనకు అందరినుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి. కాగా ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా గిబ్రాన్ మ్యూజిక్ గురించి చెప్పుకోవచ్చు. సినిమాలో ప్రధానమైన ఎమోషనల్ సన్నివేశాల్లో గిబ్రాన్ మ్యూజిక్ అద్భుతంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. వరుసగా మంచి మ్యూజిక్‌ను అందిస్తూ గిబ్రాన్ తెలుగు, తమిళ భాషల్లో ప్రామిసింగ్ సంగీత దర్శకుడుగా పేరు తెచ్చుకుంటున్నారు.

తాజా వార్తలు