“పుష్ప” షూట్ లో జాయిన్ అయిన గ్లామరస్ నటి.!

Published on Jul 8, 2021 9:14 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్న హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం అనేక హంగులతో తెరకెక్కుతుంది. అలాగే సుకుమార్ క్యాస్టింగ్ పరంగా కూడా ప్రముఖ నటీనటులను పెట్టుకొని షూట్ ని శరవేగంగా కొనసాగిస్తున్నారు. మరి ఇప్పుడు పుష్ప పార్ట్ 1 ఫైనల్ షెడ్యూల్ నడుపుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ షూట్ లో తాను కూడా మళ్ళీ పాల్గొనట్టుగా గ్లామరస్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ తెలిపింది. తన ఇన్స్టా ద్వారా అనసూయ లొకేషన్ పిక్ తో షూట్ పై అప్డేట్ ఇచ్చేసింది. మరి ఇది వరకే సుకుమార్ తో “రంగస్థలం” కి పని చేసిన అనసూయ పుష్ప లో కూడా అలాంటి ఇంపాక్ట్ ఉన్న పాత్రనే చేస్తుందని తెలుస్తుంది. మరి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :