ఇన్స్పెక్టర్ దుర్గ గా అమలా పాల్…”కుడి ఎడమైతే” నుండి గ్లింప్స్ విడుదల!

Published on Jul 9, 2021 9:05 pm IST

కుడి ఎడమైతే అంటూ ఆహా లో ప్రీమియర్ గా వస్తున్న వెబ్ సిరీస్ లో అమలా పాల్, ఈశ్వర్ రచిరజు, ప్రదీప్ రుద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే రామ్ విఘ్నేష్ క్రియేట్ చేసిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ కి పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ వెబ్ సీరీస్ లో అమలా పాల్ పాత్ర పై ఆహా వీడియో తాజాగా ఒక గ్లింప్స్ ను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఖైరతాబాద్ ఇన్ స్పెక్టర్ గా అమలా పాల్ నటిస్తుంది. అయితే నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఒక సంఘటన ను ఆసక్తికరం గా మలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లూసియా, యూ టర్న్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకుడు ఇప్పుడు మరొకసారి థ్రిల్లర్ డ్రామా ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ స్పెక్టర్ గా తనకు ఎదురైన సవాళ్ళను ఎదుర్కొంటుందా, విజయం సాధిస్తుందా అనేది తెలియాలంటే వెబ్ సిరీస్ ను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :