‘గాడ్ ఫాదర్’ హిందీ ట్రైలర్ లాంచ్ ముహూర్తం ఫిక్స్ … !

Published on Oct 1, 2022 12:00 am IST


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గాడ్ ఫాదర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సునీల్, మురళీశర్మ వంటి వారు కీలక పాత్రలు చేయగా సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేక పాత్ర చేసారు.

థమన్ సంగీతం అందించిన ఈ మూవీ యొక్క సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఇలా అన్నిటికీ ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. అయితే తెలుగుతో పాటు ఈ మూవీ మలయాళ, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ ని రేపు మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలో జరిగే గ్రాండ్ ప్రెస్ మీట్ లో లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం గాడ్ ఫాదర్ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కాగా అక్టోబర్ 5 న భారీ స్థాయిలో విడుదల కానున్న గాడ్ ఫాదర్ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని ఉయునిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :