ఈ జూన్ నెలలో రామ్ చరణ్ పెద్ది సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఒక శుభారంభంతో మొదలైతే ఎండింగ్ మాత్రం అక్కినేని వారి యంగ్ హీరో అఖిల్ అక్కినేని చూసుకుంటాడని అంతా ఫిక్స్ అయ్యారు. తాను చేస్తున్న అవైటెడ్ సినిమా ‘లెనిన్’ విడుదల జూన్ 26కి లాక్ చేశారు కానీ ఈ డేట్ లో కూడా సినిమా ఇపుడు అనుమానమే అన్నట్టుగా బలమైన రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో ఈ డేట్ కి స్లాట్ ఖాళీ అయ్యింది. మరి ఈ ఖాళీ ప్లేస్ ని సత్యదేవ్, వెంకటేష్ మహా అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ లో వస్తున్న ‘రావు బహదూర్’ కి మంచి ఛాన్స్ దొరికినట్టే అని చెప్పాలి. ఈ చిత్రాన్ని జూలై 3కి వారు లాక్ చేశారు. కానీ ఒకవేళ లెనిన్ రాకపోతే మాత్రం ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. సి ఈ రెండు సినిమాల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.


