మంచి ధర పలికిన కళ్యాణ్ రామ్ సినిమా హక్కులు !
Published on Jun 4, 2018 9:58 am IST

నందమయూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా నువ్వే’. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయకిగా నటించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చిత్ర హక్కులకి మంచి డిమాండ్ నెలకొంది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా యొక్క ఉత్తరాంధ్ర హక్కులను జిఎన్ ఫిలిమ్స్, ఏవిఆర్ ఫిలిమ్స్ కలిపి రూ.1.40 కోట్లకు కొనుగోలుచేశారు. కళ్యాణ్ రామ్ సినిమాకు ఇది మంచి ధరనే చెప్పాలి. జూన్ 14న విడుదలకానున్న ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రఫరా పిసి.శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook