“పుష్ప” సెకండ్ సింగిల్ పై మంచి అంచనాలు.!

Published on Sep 4, 2021 10:33 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప”. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ ఇటీవల లాస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకుంది. మరి ఇదిలా ఉండగా వచ్చే డిసెంబర్ నెలలో సినిమాని ఎలా అయినా తీసుకురావాలని షూట్ తో పాటుగా అప్డేట్స్ ని కూడా అప్ టు డేట్ మేకర్స్ అందిస్తున్నారు.

అలా ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ సినిమా నుంచి మరో మోస్ట్ అవైటెడ్ అప్డేట్ సెకండ్ సింగిల్ ఇదే నెలలో ఫిక్స్ అయ్యింది. మరి బహుశా అది వచ్చే వారంలో అలా ఉండొచ్చని టాక్ వినిపిస్తుండగా దీనిపై మాత్రం చాలా అంచనాలు మ్యూజిక్ లవర్స్ పెట్టుకున్నారు.

డెఫినెట్ గా ఒక చార్ట్ బస్టర్ లా ఈ సాంగ్ నిలుస్తుందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. సినీ వర్గాల్లో కూడా ఇదే టాక్ ఉంది. అయితే ఈ సాంగ్ ని మేకర్స్ బన్నీ, రష్మిక ల మధ్య ఉండే బ్యూటిఫుల్ నెంబర్ గా తెరకెక్కించారని తెలుస్తుంది. దేవి దీనికి కూడా అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చాడని టాక్ ఉంది అందుకే దీని కోసం అంతా చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :