‘స్ట్రేంజర్ థింగ్స్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

‘స్ట్రేంజర్ థింగ్స్’ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

Published on Jan 2, 2026 7:08 AM IST

స్ట్రేంజర్ థింగ్స్

ప్రస్తుతం ప్రపంచ ఆడియెన్స్ ఎంతగానో మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది స్ట్రేంజర్ థింగ్స్ అనే చెప్పాలి. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఆఖరి సీజన్ తాలూకా ఆఖరి ఎపిసోడ్ కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ తోనే ఈ సిరీస్ పూర్తయిపోయింది అనే బాధ మాత్రం చాలా మందిలో ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అయితే ఫ్యాన్స్ లో వినిపిస్తోంది.

ఫ్యాన్స్ ని అలరించేందుకు మరో సిరీస్ రాబోతుందట. అయితే ఇది కొనసాగింపు సిరీస్ కాదు కానీ సిరీస్ కి ఒక యానిమేషన్ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ వారు ఈ ఏడాది రిలీజ్ చేయబోతున్నారు. ఈ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఒరిజినల్ సిరీస్ సీజన్ 2 మరియు 3 మధ్యలో టైం లో జరిగే అంశాలపై తెరకెక్కినట్టు తెలుస్తోంది. సో ఈ సిరీస్ అభిమానులకి మాత్రం ఒకింత గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.

తాజా వార్తలు