‘సాహో’ టీజర్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 9, 2019 9:05 pm IST

‘సాహో’ అప్ డేట్ కోసం రెబెల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొత్తానికి టీజర్ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. అయితే ‘సాహో’ నిర్మాతలు టీజర్ రిలీజ్ డేట్ ను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ భారీ చిత్రం విడుద‌లకానుంది.

ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. జూన్ మూడో వారం నుండి ప్రభాస్ డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇక సాహో స‌బ్జ‌క్ట్ కి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఏక కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పైగా హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More