ఇంట్రెస్టింగ్.. ఈ కాంట్రావర్సియల్ చిత్రానికి మంచి ఓపెనింగ్స్.?

Published on May 6, 2023 7:03 am IST

గత కొన్ని రోజులు నుంచి దేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న సినిమా రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది నటి ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని తదితరులు నటించిన నిజ జీవిత చిత్రం “ది కేరళ స్టోరీ” అని చెప్పాలి. గత కొంత కాలం కితం వచ్చిన “కాశ్మీర్ ఫైల్స్” చిత్రానికి ఎలాంటి వైబ్స్ వచ్చాయో ఈ సినిమాకి కూడా ఇప్పుడు గట్టిగా వినిపించాయి.

దీనితో ఈ సినిమాని నిషేదించాలి, సినిమా రిలీజ్ ని కూడా ఆపాలి అనేంత వరకు కూడా వెళ్లింది కానీ పలు భాషలు తప్ప మిగతా ప్రాంతాల్లో అయితే ఈ సినిమా థియేటర్లు లో రిలీజ్ అయ్యింది. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రానికి మొదటి రోజు ఇండియా వైడ్ సాలిడ్ ఓపెనింగ్స్ నమోదు అయినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

లిమిటెడ్ గానే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొత్తం 8 కోట్ల మేర ఓపెనింగ్స్ ని రాబట్టిందట. మరి ఇది ఇండియాలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 కన్నా ఎక్కువ అన్నట్టు తెలుస్తోంది. మరి కేరళ స్టోరి అయితే ముందు రోజుల్లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :